వెల్ కమ్ బ్యాక్ సునీత -మోడి పోస్ట్ 1 y ago
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ బృందానికి ప్రధాని నరేంద్ర మోడి ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘‘క్రూ 9.. మీకు స్వాగతం. భూమి మిమ్మల్ని మిస్ అయింది. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు. సునీత విలియమ్స్ ఒక మార్గదర్శకురాలు. మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.